
బిగ్ బాస్ సీజన్ 4లో దసరా స్పెషల్ ఎపిసోడ్ లో హోస్ట్ గా సమంత సందడి చేసింది. నాగార్జున బదులుగా ఆయన కోడలు సమంత ఈ షోని హ్యాండిల్ చేసింది. సోమవారం నుండి శనివారం వరకు హౌజ్ మేట్స్ గేం ఆడితే శని, ఆదివారాల్లో హోస్ట్ వారిని ఆడుకుంటాడు. సాటర్ డే హోస్ట్ లేకుండానే నడిపించిన బిగ్ బాస్ ఆదివారం పండుగ సందర్భంగా సమంతతో పండుగని మరింత స్పెషల్ గా మారింది.
సమంతతో పాటుగా అఖిల్ కూడా షోలో అలా కనిపించి వెళ్ళాడు. తను చేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా ప్రమోషన్స్ కు అఖిల్ కూడా బిగ్ బాస్ స్టేజ్ మీద అలరించాడు. అంతేకాదు కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ స్పెషల్ పర్ఫార్మెన్స్ తో స్టేజ్ మరింత కలర్ ఫుల్ గా మారింది. ఇక జబర్దస్త్ హైపర్ ఆది కూడా బిగ్ బాస్ లో కనిపించాడు. డిటెక్టివ్ గా వచ్చి హౌజ్ లో ఉన్న వారందరి గురించి మనసులో ఉన్నది చెప్పుకుంటూ వెళ్ళాడు. మొత్తానికి సమంత రాకతో సూపర్ ఎంటర్టైనర్ గా షో నిలిచింది. అంతేకాదు సమంత మామకు తగ్గ కోడలే అనేలా హోస్టింగ్ మొదటిసారే అయినా బాగా చేసింది.