
బుట్ట బొమ్మ పూజా హెగ్దేకి తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. స్టార్ సినిమా అంటే చాలు పూజా హెగ్దే దగ్గర కు వెళ్లి ఆమె కాదన్న తర్వాత వేరే హీరోయిన్ దగ్గరకు ఛాన్స్ వెళ్తుంది. ఈ ఇయర్ ఆల్రెడీ అల వైకుంఠపురములో సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది అమ్మడు. అందుకే సోషల్ మీడియా ఫాలోవర్స్ లో ఆమె అదరగొడుతుంది.
పూజా హెగ్దే ఇన్ స్టాగ్రాం లో 12 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సౌత్ స్టార్ హీరోయిన్స్ లో ఇది ఒక అద్భుతమైన రికార్డ్ అని చెప్పొచ్చు. పూజా ఏదైనా కామెంట్ పెడితే అది కోటి 20 లక్షల మందికి ఒకేసారి రీచ్ అవుతుందన్నమాట. స్టార్ హీరోలకు ధీటుగా హీరోయిన్స్ సోషల్ ఫాలోవర్స్ ఉంటున్నారు. తప్పకుండా పూజా హెగ్దే ఇప్పుడున్న రేంజ్ కన్నా మరింత ఫాలోయింగ్ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు. తెలుగులోనే కాదు బాలీవుడ్ లో కూడా పూజా హెగ్దే వరుస సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ తో రాధే శ్యాం సినిమాలో నటిస్తున్న అమ్మడు. అఖిల్ బ్యాచ్ లర్ సినిమాలో కూడా ఆమె ఛాన్స్ అందుకుంది.