
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత వరుసగా లైన్ లో సినిమాలు పెట్టారు. క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలు క్యూలో ఉండగా లేటెస్ట్ గా సాగర్ చంద్ర డైరక్షన్ లో పవర్ స్టార్ సినిమా కన్ఫాం అయ్యింది. మళయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుం కోషియం సినిమా తెలుగు రీమేక్ లో పవన్ ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాలో మరో పాత్రలో రానా కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది.
ఈ సినిమాకు టైటిల్ గా బిల్లా రంగా అని టైటిల్ అనుకుంటున్నారట. ఆల్రెడీ ఈ టైటిల్ తో చిరంజీవి సినిమా వచ్చింది. చిరు, మోహన్ బాబు కలిసి నటించిన బిల్లా రంగా సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ సూపర్ హిట్ రీమేక్ కు ఆ టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారట. మెగాస్టార్ టైటిల్ తో పవర్ స్టార్ సినిమా అంటే మెగా ఫ్యాన్స్ కు అంతకుమించి ఆనందం ఏముంటుంది. మరి ఈ సినిమా టైటిల్ అదే పెడతారా లేక వేరేది ఆలోచిస్తారా అన్నది చూడాలి.