
అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా టీజర్ దసరా సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తే ఈసారి అఖిల్ పక్కా హిట్ అందుకునేలా ఉన్నాడని చెప్పొచ్చు.
తనకు కావాల్సిన పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఓ బ్యాచ్ లర్ పడే తపనతో ఈ సినిమా వస్తుందని టీజర్ చూస్తేనే తెలుస్తుంది. ఈ సినిమాలో అఖిల్ చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నాడు. వరుస సూపర్ హిట్లతో దూసుకెళ్తున్న పూజా హెగ్దే కూడా ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ టీజర్ సినిమా అంచనాలను పెంచింది. 2021 సంక్రాంతి రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా అఖిల్ కోరుకునే హిట్ అందిస్తుందో లేదో చూడాలి.