
మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో చిరంజీవి హీరోగా చేస్తున్న ఆచార్య సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ కు 30 మినిట్స్ రోల్ ఇచ్చినట్టు టాక్. ట్రిపుల్ ఆర్, ఆచార్య రెండు సినిమాల తర్వాత చరణ్ మరోసారి కొరటాల శివతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడని టాక్. 2021 సెకండ్ హాఫ్ లో ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది.
ఆచార్య తర్వాత కొరటాల శివ అల్లు అర్జున్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమా 2021 సెకండ్ హాఫ్ లో మొదలై 2022 మొదట్లో రిలీజ్ అవుతుంది. సో చరణ్ తో కొరటాల శివ సినిమా ఎనౌన్స్ చేసినా వచ్చే ఏడాది చివర్లో మొదలయ్యే అవకాశం ఉంది. తప్పకుండా చరణ్, కొరటాల శివల కాంబినేషన్ లో క్రేజీ సినిమా వస్తుందని చెప్పొచ్చు. త్వరలోనే ఈ కాంబోకి సంబందించిన అఫీషియల్ న్యూస్ బయటకు వస్తుందని అంటున్నారు.