
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా రాధే శ్యామ్. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతుంది. కరోనా లాక్ డౌన్ తర్వాత ఇటలీ వెళ్లి షూట్ చేస్తున్న మొదటి సినిమా ఇదే అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకు మొదటి నుండి మ్యూజిక్ డైరక్టర్ పై కన్ ఫ్యూజన్ కొనసాగుతుంది.
ఫైనల్ గా ఈ సినిమాకు డియర్ కామ్రేడ్ మ్యూజిక్ డైరక్టర్ జస్టిన్ ప్రభాకరన్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో రాధే శ్యామ్ రిలీజ్ అవుతుంది. బాహుబలితో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకుని సాహోతో అంచనాలు అందుకోలేని ప్రభాస్ రాధే శ్యామ్ తో మరోసారి రికార్డులు సృష్టించాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమాను 2021 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.