భీమ్ టీజర్ డేట్, టైమ్ ఫిక్స్..!

ఆర్.ఆర్.ఆర్ సినిమా నుండి రాబోతున్న సెకండ్ టీజర్ పై ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా రాం చరణ్ అదరగొట్టగా కొమరం భీమ్ పాత్రలో తారక్ ఎలా ఉంటాడా అని నందమూరి ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు. దసరా కానుకగా అక్టోబర్ 22న కొమరం భీం టీజర్ రిలీజ్ ప్లాన్ చేశారు చిత్రయూనిట్. కొమరం భీమ్ జయంతి సందర్భంగా ఈ టీజర్ రిలీజ్ చేస్తున్నారు.

22న ఉదయం 11 గంటలకు కొమరం భీమ్ వస్తున్నాడు. తారక్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులు అందరికి ఈ టీజర్ పై ఆసక్తి ఏర్పడింది. అల్లూరి అదరగొట్టగా భీమ్ బాక్సులు బద్ధలు కొట్టడం ఖాయమని ఫిక్స్ అవుతున్నారు. మరి టీజర్ ఎలా ఉంటుంది.. రామరాజు ఫర్ భీమ్ సినిమాపై ఏమేరకు అంచనాలు పెంచుతుంది అన్నది తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.