మెగా హీరో సినిమాలో రానా

ఎన్.టి.ఆర్ బయోపిక్ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు క్రిష్. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో సినిమా చేస్తున్నాడు వైష్ణవ్ తేజ్. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుందని తెలిసిందే. కొండపొలం నవల ఆధారంగా తెరకెక్కించే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 

ఈ సినిమాలో దగ్గుబాటి వారసుడు రానా కూడా స్పెషల్ రోల్ చేస్తున్నట్టు టాక్. క్రిష్ డైరక్షన్ లో రానా హీరోగా కృష్ణంవందే జగద్గురుం సినిమా వచ్చింది. ఈ సినిమాతోనే రానా స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. మెగా హీరో సినిమాలో రానా అనగానే తప్పకుండా సినిమాకు స్పెషల్ క్రేజ్ వచ్చినట్టే. వైష్ణవ్ తేజ్ సినిమా పూర్తయ్యాక పవన్ సినిమా షూటింగ్ ప్రారంభించాలని చూస్తున్నారు. పి.ఎస్.పి.కె 27వ సినిమా డిసెంబర్ లో తిరిగి సెట్స్ మీదకు వెళ్తుందని టాక్.