విజయ్ దేవరకొండతో బోయపాటి.. కాంబో అదుర్స్..!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ డైరక్షన్ లో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ముంబై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సగానికి పైగా షూటింగ్ పూర్తయింది. ఇక ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను డైరక్షన్ లో విజయ్ దేవరకొండ సినిమా ఉంటుందని తెలుస్తుంది. దిల్ రాజు ఈ క్రేజీ కాంబినేషన్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. భద్ర తర్వాత దిల్ రాజు, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న సినిమాగా ఈ ప్రాజెక్ట్ పై భారీ క్రేజ్ ఏర్పడింది.

ఫైటర్ పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందని తెలుస్తుంది. బోయపాటి లాంటి మాస్ డైరక్టర్ కు విజయ్ దేవరకొండ లాంటి క్రేజీ హీరో దొరికితే సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమా పక్కా పైసా వసూల్ మూవీగా ఉంటుందని మాత్రం ఆడియెన్స్ ఫిక్స్ అవుతున్నారు. సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో రానుంది.