
స్వీటీ అనుష్క లీడ్ రోల్ లో హేమంత్ మధుకర్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా నిశ్శబ్ధం. కోనా వెంకట్ నిర్మించిన ఈ సినిమా అంచనాలను అందుకోలేదు. అమేజాన్ ప్రైం లో రిలీజైన ఈ సినిమా టాక్ బాగాలేకున్నా సరే డిజిటల్ వ్యూస్ బాగానే రాబట్టిందని తెలుస్తుంది. సినిమా బాగాలేదని టాక్ వచ్చినా సరే వ్యూస్ పరంగా హిట్ అన్నట్టే లెక్క అంటున్నారు సిని విశ్లేషకులు.
అనుష్క ప్రధాన పాత్రలో నటించిన నిశ్శబ్ధం సినిమాలో అంజలి, షాలిని పాండేలు నటించారు. మేల్ లీద్ గా మాధవన్ నటించడం జరిగింది. ఫ్లాప్ టాక్ వచ్చినా సరే డిజిటల్ వ్యూస్ లో సినిమా హిట్ కొట్టింది నిశ్శబ్ధం. థియేటర్ రిలీజ్ అయితే పరిస్థితి ఎలా ఉండేదో కాని నిశ్శబ్ధం సినిమా డిజిటల్ ఫ్లాట్ ఫాం పై యావరేజ్ సినిమాగా నిలిచిందని టాక్.