మహా సముద్రంలో అను.. ఫైనల్ గా ఒక ఛాన్స్..!

ఆరెక్స్ 100 సినిమాతో మొదటి సినిమానే సూపర్ హిట్ అందుకున్న డైరక్టర్ అజయ్ భూపతి తన నెక్స్ట్ సినిమా మహా సముద్రం ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమాను శర్వానంద్, సిద్ధార్థ్ మల్టీస్టారర్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు అజయ్ భూపతి. ఈ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్ గా అదితి రావు హైదరిని సెలెక్ట్ చేయగా మరో హీరోయిన్ గా అను ఇమ్మాన్యుయెల్ ను తీసుకున్నారట. అజ్ఞాతవాసి, నా పేరు సూర్య, శైలజా రెడ్డి అల్లుడు మూడు క్రేజీ సినిమాలు చేసినా సరే ఆమెకు లక్ కలిసి రాలేదు.

కొద్దిపాటి గ్యాప్ తర్వాత అను ఇమ్మాన్యుయెల్ కు మంచి ఛాన్స్ వచ్చిందని చెప్పొచ్చు. అజయ్ భూపతి సినిమా.. అందులోనూ మల్టీస్టారర్ అనగానే సినిమాపై సూపర్ బజ్ ఏర్పడింది. మరి ఈ సినిమాతో అను హిట్ ట్రాక్ ఎక్కుతుందో లేదో చూడాలి.