
అక్కినేని అఖిల్, పూజా హెగ్దే కాంబినేషన్ లో బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. సినిమాకు సంబందించిన పోస్టర్స్ అలరించగా లేటెస్ట్ గా సినిమా నుండి ప్రీ లుక్ టీజర్ రిలీజ్ చేశారు. కెరియర్ కరెక్ట్ గా ప్లాన్ చేస్తున్న్నా కాని మ్యారేజ్ విషయంలో తడపడుతున్న ఓ యువకుడి కథ ఈ సినిమా.
ఈ ప్రీ టీజర్ లో అఖిల్ తన లుక్స్ తో ఆకట్టుకున్నాడు. అసలు టీజర్ దసరా సందర్భంగా ఈ నెల 25న రిలీజ్ ప్లాన్ చేస్తారని తెలుస్తుంది. గోపిసుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2021 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మరి అఖిల్ ఈ సినిమాతో హిట్టు కొట్టాలని చూస్తుండగా అది నెరవేరుతుందో లేదో చూడాలి.