ప్రభాస్ సినిమా రెమ్యునరేషనే 200 కోట్లట..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యాం తర్వాత రెండు క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో సినిమా ఓకే చేసిన ప్రభాస్ ఓం రౌత్ డైరక్షన్ లో ఆదిపురుష్ అంటూ స్ట్రైట్ హిందీ మూవీ ఎనౌన్స్ చేశారు. నాగ్ అశ్విన్ సినిమా కన్నా ఆదిపురుష్ సినిమానే ముందు రిలీజ్ అయ్యేలా ఉంది. నాగ్ అశ్విన్ సినిమా కూడా సైన్స్ ఫిక్షనల్ స్టోరీగా వస్తుందట.

ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. బిగ్ బీ అమితాబ్ కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. సినిమాలో అమితాబ్ నటిస్తున్నందుకు 20 కోట్ల దాకా డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. దీపికాకు 30 కోట్లు ఇస్తున్నట్టు టాక్. అంతేకాదు ప్రభాస్ కు 100 కోట్లు, డైరక్టర్ నాగ్ అశ్విన్ కు 15 నుండి 20 కోట్లు ఇలా చూస్తే ప్రభాస్ 21 సినిమాకు 200 కోట్లు రెమ్యునరేషన్ కే అయ్యేలా ఉంది. 500 కోట్ల భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసిన ఈ సినిమాలో చాలా సర్ ప్రైజులు ఉన్నట్టు తెలుస్తుంది.