బాబాయ్ నువ్వు రెడీ అయితే నేను రెడీ..!

సాయి ధరం తేజ్ బర్త్ డే సందర్భంగా మంచు మనోజ్ చేసిన ఇంట్రెస్టింగ్ ట్వీట్ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇంతకీ మనోజ్ ఏం ట్వీట్ చేశాడంటే హ్యాపీ బర్త్ డే బాబాయ్.. యాదృశ్చికంగా బ్లాక్ బస్టర్ మల్టీస్టారర్ బిల్లా రంగా కూడా నేటితో 38 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇది మనకు ఏదో చెబుతుంది అంటూ ట్వీట్ చేశాడు మంచు మనోజ్.     

ఆల్రెడీ వేదం సినిమాలో అల్లు అర్జున్ తో కలిసి నటించాడు మంచు మనోజ్. అయితే మనోజ్ చేసిన ట్వీట్ ను చూస్తే సాయి ధరం తేజ్ తో మల్టీస్టారర్ కు సిద్ధం అన్నట్టు తెలుస్తుంది. మెగా మల్టీస్టారర్ కథ దొరకాలే కాని ఇద్దరు యువ హీరోలు చేసేందుకు రెడీ అన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సాయి ధరం తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత దేవా కట్ట డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.