మారుతి.. రవితేజ.. మొదలుపెట్టడమే లేట్..!

సక్సెస్ ఫుల్ డైరక్టర్ మారుతి లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో సాయి ధరం తేజ్ తో ప్రతిరోజూ పండుగే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. మారుతి తన నెక్స్ట్ సినిమా మాస్ మహరాజ్ రవితేజ హీరోగా చేస్తున్నట్టు తెలుస్తుంది. మారుతి డైరక్షన్ లో రవితేజ మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారట. ప్రసుతం రవితేజ క్రాక్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రమేష్ వర్మ డైరక్షన్ లో కిలాడి కూడా లైన్ లో ఉంది.

క్రాక్ ఆల్రెడీ రిలీజ్ కు రెడీ అవుతుండగా కిలాడితో పాటుగా మారుతి సినిమా కూడా ఒకేసారి సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు రవితేజ. రాజా ది గ్రేట్ తర్వాత సరైన హిట్ దక్కించుకోలేని రవితేజ ఈసారి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో సినిమాలు చేస్తున్నాడు. మీడియం గ్యారెంటీ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న మారుతి రవితేజతో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.