ఆచార్యలో మహేష్ కనిపించడు వినిపిస్తాడు..!

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమాలో రాం చరణ్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. చరణ్ నటిస్తున్న ఈ పాత్రకు ముందు మహేష్ ను అనుకున్నారు. చిరు, మహేష్ మల్టీస్టారర్ సినిమాగా ఆచార్య వస్తుందని ఆశపడ్డారు కాని అది జరగలేదు. ఇక లేటెస్ట్ గా ఆచార్య సినిమాలో మహేష్ ఉంటాడట కాని కనిపించడు వినిపిస్తాడని టాక్.

సినిమా కోసం మహేష్ వాయిస్ ఓవర్ ఇస్తాడని టాక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జల్సా సినిమా కోసం వాయిస్ ఓవర్ అందించిన మహేష్ మరోసారి తన వాయిస్ ఇస్తున్నాడట. ఆచర్యకు మహేష్ ఆ విధంగా సపోర్ట్ ఇస్తున్నాడు. తప్పకుండా మహేష్ వాయిస్ ఓవర్ కూడా సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పొచ్చు.