
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా భారీ అంచనాలతో వస్తుంది. అశ్వనిదత్ నిర్మాణంలో 500 కోట్ల భారీ బడ్జెట్ ను ఈ సినిమాకు కేటాయిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. బిగ్ బీ అమితాబ్ కూడా సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నాగ్ అశ్విన్ అమితాబ్ కు 40 నిమిషాల పాత్ర ఇచ్చాడని టాక్.
సినిమాకు హైలెట్ అయ్యే పాత్రల్లో అమితాబ్ ది ఒకటని తెలుస్తుంది. ఈ సినిమాలో నటించినందుకు గాను అమితాబ్ కు 20 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. అమితాబ్ వల్ల సినిమాకు కచ్చితంగా సూపర్ క్రేజ్ ఏర్పడుతుంది. అందుకే ఆయన అడిగినంత ఇచ్చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ రాదే శ్యాం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆదిపురుష్ కూడా లైన్ లో ఉంది. ఈ రెండు సినిమాలు పూర్తి చేసిన తర్వాత నాగ్ అశ్విన్ డైరక్షన్ లో సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.