అలిమేలుమంగ కోసం కీర్తి సురేష్..!

సీనియర్ డైరక్టర్ తేజా కొద్దిపాటి గ్యాప్ తర్వాత నేనే రాజు నేనే మంత్రి సినిమాతో హిట్ అందుకున్నా ఆ తర్వాత సీత సినిమా తీసి మళ్ళీ ట్రాక్ తప్పాడు. ఒకేసారి రెండు సినిమాలు ఎనౌన్స్ చేసి సర్ ప్రైజ్ చేసిన తేజా ప్రస్తుతం బిగ్ బాస్ స్టార్ నందిని రాయ్ తో ఇస్ స్టోరీస్ అంటూ ఓ వెబ్ సీరీస్ చేస్తున్నాడు. ఈ వెబ్ సీరీస్ తర్వాత తను ఎనౌన్స్ చేసిన అలిమేలు వెంకటరమణ, రాకషస రాజు రావణాసురుడు సినిమాలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. 

గోపిచంద్ హీరోగా అలిమేలుమంగ వెంకటరమణ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్టు టాక్. మహానటి సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అభినయ తార కీర్తి సురేష్ అలాంటి హీరోయిన్ తో తేజా ఎలాంటి సినిమా చేస్తాడో అని ఆడియెన్స్ లో ఆసక్తి పెరిగింది. తేజా సినిమాల్లో హీరోయిన్స్ కు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. మరి కీర్తి సురేష్ తో తేజా ఎలాంటి ప్రయోగం చేస్తాడో చూడాలి.