RRR.. రికార్డ్ డిజిటల్ రైట్స్ డీల్..!

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా RRR. ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమాపై అంచనాలు రాస్థాయిలో ఉన్నాయి. టైటిల్ పోస్టర్ తో పాటుగా రాం చరణ్ అల్లూరి ఫస్ట్ లుక్ టీజర్ అదరగొట్టింది. ఇక అక్టోబర్ 22న కొమరం భీం టీజర్ రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. ఇదిలాఉంటే ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వక ముందే డిజిటల్, శాటిలైట్ రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది.  

రాజమౌళి సినిమా అంటే రికార్డులు కొట్టడం గ్యారెంటీ అందుకే డిజిటల్, శాటిలైట్ డీల్స్ ముందే సెట్ చేసుకుంటున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం RRR డిజిటల్ రైట్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 200 కోట్లకి కొనేసిందని తెలుస్తుంది. అన్ని భాషల్లోకి కలిపి ఈ డిజిటల్ రైట్స్ కొనేసినట్టు టాక్. ఇక శాటిలైట్ రైట్స్ మాత్రం స్టార్ గ్రూప్ తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. శాటిలైట్ డీల్ కూడా చర్చల్లో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి సినిమా రిలీజ్ ముందే భారీ రేంజ్ లో బిజినెస్ చేస్తూ RRR సరికొత్త రికార్డ్ సృష్టించింది.