
మెగా పవర్ స్టార్ రాం చరణ్ ట్రిపుల్ ఆర్ తర్వాత చేయబోయే సినిమాపై డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఛలో, భీష్మ ఫేమ్ వెంకీ కుడుముల కథను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తున్న చరణ్ రైటర్ గా సక్సెస్ అందుకుని డైరక్టర్ గా చేసిన మొదటి ప్రయత్నం ఫెయిల్ అయిన వక్కంతం వంశీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. రైటర్ గా ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చిన వక్కంతం వంశీ డైరక్టర్ గా మాత్రం ఫ్లాప్ అందుకున్నాడి.
అల్లు అర్జున్ తో తెరకెక్కించిన నా పేరు సూర్య సినిమా ఆడియెన్స్ ను నిరాశపరచింది. బన్నీ బాగా హార్డ్ వర్క్ చేసినా సరే ఆ సినిమా ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేదు. నా పేరు సూర్య ఫ్లాప్ అవడంతో డైరక్టర్ గా అతనికి సెకండ్ ఛాన్స్ ఇచ్చేందుకు స్టార్స్ వెనకడుగు వేస్తున్నారు. అయితే చరణ్ మాత్రం అందుకు విరుద్ధంగా మంచి కథ ఉంటే చేసేద్దాం అన్నాడట. ఈమధ్యనే ఓ లైన్ వినిపించగా చరణ్ దానికి ఓకే చెప్పాడట. ఫుల్ స్క్రిప్ట్ నచ్చితే చరణ్ తోనే వక్కతం వంశీ సినిమా ఫిక్స్ అయినట్టే.