
టాలీవుడ్ లో హీరోయిన్ గా సత్తా చాటుతున్న తెలుగు అమ్మాయి రీతు వర్మ. అంతకుముందు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ వచ్చిన అమ్మడు విజయ్ దేవరకొండ హీరోగా చేసిన పెళ్లిచూపులు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. తెలుగు హీరోయినే అయినా తమిళ, మళయాళ భాషల్లో కూడా ఆమె ఛాన్సులు అందుకుంటుంది. తెలుగు పెద్దగా రాణించలేదని అనుకున్న రీతు వర్మ ఇక్కడ కూడా వరుస ఛాన్సులు అందుకుంటుంది.
ప్రస్తుతం నాని చేస్తున్న టక్ జగదీష్ లో హీరోయిన్ గా నటిస్తున్న రీతు వర్మ శర్వానంద్ బైలింగ్వల్ మూవీలో కూడా ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. ఇక నాగ శౌర్య చేస్తున్న సినిమాలో కూడా రీతుకి అవకాశం దక్కిందట. లేటెస్ట్ గా మాస్ మహరాజ్ రవితేజ హీరోగా రమేష్ వర్మ డైరక్షన్ లో సినిమాకు కూడా రీతు వర్మకు ఆఫర్ వచ్చిందట. మొత్తానికి ఒకేసారి నాలుగు సినిమాల్లో నటిస్తూ తెలుగులో తన స్టామినా ప్రూవ్ చేసుకోవాలని చూస్తుంది రీతు వర్మ మరి అమ్మడికి లక్ కలిసి వచ్చి ఈ సినిమాలన్ని సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం.