
ప్రస్తుతం తెలుగులో సూపర్ ఫాంలో ఉన్న హీరోయిన్ గా పూజా హెగ్దే సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. కెరియర్ మొదట్లో రెండు సినిమాలు ఫ్లాప్ అయినా కూడా టాలీవుడ్ లో వరుస స్టార్ సినిమాలు చేస్తూ సత్తా చాటుతుంది బుట్ట బొమ్మ. అమ్మడి చేతిలో ప్రస్తుతం రాధే శ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాలు ఉన్నాయి. ప్రభాస్ హీరోగా చేస్తున్న రాధే శ్యామ్ సినిమాలో పూజా హెగ్దే ప్రేరణ పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పూజా హెగ్దే బర్త్ డే కానుకగా ఈరోజు రిలీజ్ చేశారు.
పిరియాడికల్ లవ్ స్టోరీగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్న రాధే శ్యాం సినిమాలో ప్రేరణగా ప్రేక్షకుల మనసులు దోచుకునేందుకు రెడీ అయ్యింది పూజా హెగ్దే. ఇక ఈ సినిమాతో పాటుగా అఖిల్ బ్యాచ్ లర్ సినిమా నుండి కూడా పూజాకి బర్త్ డే విషెస్ తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అఖిల్ సినిమాలో గ్లామర్ షో చేస్తున్న పూజా రాధే శ్యాం లో మాత్రం అందాల రాశిగా కనిపిస్తుంది. మరి ఈ రెండు డిఫరెంట్ సినిమాలు చేస్తున్న పూజా హెగ్దే ఈ సినిమాల రిలీజ్ తర్వాత మరింత పాపులర్ అయ్యే ఛాన్స్ ఉంది.