అఖిల్ తో రష్మిక

కెరియర్ లో మూడు సినిమాలు చేసినా సరే ఇంతవరకు ఒక్కటి కూడా కమర్షియల్ సక్సెస్ అందుకోని అఖిల్ ప్రస్తుతం చేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకునాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో పూజా హెగ్దే గ్లామర్ షో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు. 2021 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ మూవీ తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డి డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. మాస్ డైరక్టర్ సురేందర్ రెడ్డి మెగా హీరోలైన అల్లు అర్జున్, రాం చరణ్, చిరంజీవిలతో సినిమాలు తీసి సూపర్ హిట్లు అందుకున్నాడు. సైరా తర్వాత స్టార్స్ అంతా బిజీ అవడంతో అఖిల్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు సురేందర్ రెడ్డి. ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వేళ్తుందని తెలుస్తుంది. అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కన్నడ భామ రష్మిక మందన్నని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. 

ప్రస్తుతం టాలీవుడ్ లో ఫాంలో ఉన్న హీరోయిన్స్ ఇద్దరిలో ఒకరు పూజా హెగ్దే కాగా మరొకరు రష్మిక మందన్న. బ్యాచ్ లర్ సినిమాలో పూజాతో రొమాన్స్ చేస్తున్న అఖిల్ ఈ సురేందర్ రెడ్డి సినిమాలో మాత్రం రష్మికతో జోడీ కడుతున్నాడట. మరి అఖిల్ తో రష్మిక చేసే హంగామా ఎలా ఉంటుందో చూడాలి.