
అక్కినేని నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వస్తున్న క్రేజీ మూవీ లవ్ స్టోరీ. సినిమాలో చైతు సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల డైరక్షన్ లో సాయి పల్లవి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా నుండి వచ్చిన ప్రచార చిత్రాలు సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేశాయి. కరోనా లాక్ డౌన్ తర్వాత ఈమధ్యనే షూటింగ్ మొదలుపెట్టిన లవ్ స్టోరీ టీం ఆల్రెడీ షూట్ చేసిన కొన్ని సీన్స్ రీ షూట్ చేస్తున్నారని తెలుస్తుంది.
లాక్ డౌన్ లో రష్ చూసి అసంతృప్తిగా ఫీల్ అయ్యాడట శేఖర్ కమ్ముల అందుకే ఆల్రెడీ పూర్తయిన కొన్ని సీన్స్ రీ షూట్ చేస్తున్నట్టు టాక్. సినిమా అన్న తర్వాత రీ షూట్స్ చాలా కామన్ కాని లవ్ స్టోరీ విషయంలో అది రిపీట్ అవుతుదని తెలుస్తుంది. శేఖర్ కమ్ముల మీద నమ్మకంతో చైతు ఈ సినిమా ఆయన ఎలా చెబితే అలా చేస్తున్నాడట. కె.కె రాధామోహన్ నిర్మిస్తున్న లవ్ స్టోరీ సినిమా డిసెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.