
సూపర్ స్టార్ మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ ఎప్పుడు ప్రేక్షకులను ఉపయోగపడే విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటారు. ఈమధ్యనే తన పిల్లలను స్విమ్మింగ్ లో ఒలంపిక్స్ కు రెడీ చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చిన నమ్రత. లేటెస్ట్ గా తన ఇన్ స్టాగ్రాంలో 30 డేస్ మెంటల్ హెల్త్ ఛాలెంజ్ ఒకటి షేర్ చేసింది. 30 రోజులు ఇవి చేస్తే తప్పకుండా అందరు ఫిట్ గా ఉంటారని.. ప్రస్తుత పరిషితుల్లో ఇది చాలా ఉపయోగపడుతుందని అంటున్నారు నమ్రత శిరోద్కర్.
మహేష్ తన సక్సెస్ సీక్రెట్ నమ్రత అని చెబుతుంటారు. ఆ విషయం నిజమే అని ఒప్పుకునేలా తన పర్ఫెక్షన్ ఉంది. ప్రేక్షకులకు ఎంతో ఉపయోగకరమైన విషయాలను ఎప్పటికప్పుడు వారికి అందిస్తూ తన మార్క్ చూపించాలని చూస్తుంది. సూపర్ స్టార్ సతీమణిగానే కాదు ఓ రెస్పాన్సిబుల్ పర్సన్ గా నమ్రత చేస్తున్న కొన్ని పనులు మహేష్ ఫ్యాన్స్ ను ఖుషి అయ్యేలా చేస్తున్నాయి.