
బిగ్ బాస్ సీజన్ 4లో ఎవరు ఊహించని విధంగా కంటెస్టంట్ గా వచ్చి సర్ ప్రైజ్ ఇచ్చారు మై విలేజ్ షో గంగవ్వ. నెల రోజులు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 4లో హౌజ్ లో రెండో వారం ఇబ్బంది పడ్డ గంగవ్వ హెల్త్ చెకప్ చేసుకోగా కొద్దిగా సెట్ అయ్యారు. ఇక ఐదవ వారలో మళ్ళీ గంగవ్వ అనారోగ్య సమస్యలు వచ్చినట్టు తెలుస్తుంది. గంగవ్వ కూడా మానసికంగా ఇబ్బంది పడుతుంది. ఇలాంటి టైంలో ఆమెను హౌజ్ లో ఉంచడం కష్టమని భావించిన బిగ్ బాస్ టీం ఆమెను హౌజ్ నుండి బయటకు పంపిస్తున్నట్టు తెలుస్తుంది.
శనివారం ఎపిసోడ్ లో గంగవ్వ అనారోగ్య సమస్యల గురించి తెలుసుకున్న నాగార్జున ఆమెను ఇంటికి పంపించాలని నిర్ణయించారు. బిగ్ బాస్ లో ఐదువారాల పాటుగా గంగవ్వ ప్రేక్షకులను అలరించారు. 60 ప్లస్ ఏజ్ లో గంగవ్వ బిగ్ బాస్ కు రావడమే ఆమె విజేతగా నిలిచినట్టు లెక్క. నామినేషన్స్ లో ఆమె వచ్చినా సరే ఆమెను ప్రేక్షకులు అత్యధిక ఓట్లతో సేవ్ చేస్తారు. తనంతట తాను వెళ్తుంది కాబట్టి ఆమె ఎగ్జిట్ ఆడియెన్స్ కూడా యాక్సెప్ట్ చేయక తప్పట్లేదు.