
కన్నడ సూపర్ హిట్ మూవీ కె.జి.ఎఫ్ మొదటి పార్ట్ సూపర్ హిట్ అవగా సెకండ్ పార్ట్ షూటింగ్ జరుగుతుంది. మొదటి పార్ట్ భారీ హిట్ కాగా కె.జి.ఎఫ్ చాప్టర్ 2పై భారీ అంచనాలతో వస్తుంది. ఈసారి బాలీవుడ్ స్టార్స్ సంజత్ దత్, రవీనా టాండన్ కూడా నటిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ తర్వాత ఈమధ్యనే షూటింగ్ మొదలుపెట్టిన ప్రశాంత్ నీల్ నవంబర్ కల్లా సినిమా పూర్తి చేయాలని చూస్తున్నారు.
ఈ సినిమాను 2021 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాను కన్నడతో పాటుగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అయితే సంక్రాంతికి తెలుగులో నితిన్ రంగ్ దే, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాలు రిలీజ్ ఫిక్స్ చేశారు. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమాల మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. మరి కె.జి.ఎఫ్ చాప్టర్ 2 అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది సినిమా వస్తేనే గాని తెలుస్తుంది.