బర్త్ డే రోజు రాజమౌళి మీద కంప్లైంట్స్..!

దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే పక్కా హిట్ అన్నట్టే లెక్క. రాజమౌళి రాజ ముద్ర పడ్డ సినిమా బాక్సాఫీస్ పై రికార్డులు సృష్టించడం ఖాయం. సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న రాజమౌళి బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచాడు. ఆ సినిమా తర్వాత ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ అంటూ మరో సెన్సేషనల్ మూవీ చేస్తున్నాడు రాజమౌళి. హిట్టుకి కేరాఫ్ అడ్రెస్ అయిన రాజమౌళి గురించి తన బర్త్ డే రోజు కంప్లైంట్స్ ఏంటో చెప్పారు ఆర్.ఆర్.ఆర్ టీం.

ముందుగా రాజమౌళి దగ్గర కో డైరక్టర్ గా చేస్తున్న త్రికోటి స్టోరీ సిట్టింగ్ కు ఎక్కడెక్కడో వెళ్తారు కాని ఆయన మాత్రం ఇంటి మేడ మీద సెట్ చేస్తారని అన్నారు. కీరవాణి కూడా పల్లవి కి చరణానికి ఆరు నెలలు ఆ తవాత రికార్డింగ్ కు మరో మూడు నెలలు.. వాయిస్ మిక్సింగ్ ఆ తర్వాత అసలు చేస్తున్న సినిమా కూడా మర్చిపోయేలా చేస్తాడని కీరవాణి కంప్లైంట్ ఇచ్చారు. ఇక ఎన్.టి.ఆర్ కరెక్ట్ గా ప్యాకప్ చెప్పే టైం కు షాట్ మొదలుపెడతాడని దానికి నాలుగు గంటల దాకా పడుతుందని అన్నారు. ఇక రాం చరణ్ 40 అడుగుల నుండి జంప్ చేయాలని అంటాడు. డూప్ పెట్టి చేద్దాం సర్ అంటే ఆయన ల్యాప్ టాప్ చూపించి ఆల్రెడీ అన్ని యాంగిల్స్ లో ఆయన చేసి చూపించింది చూసి ఇక తన నోట మాట రాదని అన్నాడు. ఇలా రాజమౌళి మీద తన కంప్లైంట్ ఇచ్చిన ఆర్.ఆర్.ఆర్ టీం ఫైనల్ గా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.