ఎన్.టి.ఆర్ నుండి ఓ హెచ్చరిక..!

ప్రస్తుత సమాజంలో జరుగుతున్న నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ వస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. సైబర్ మోసాల గురించి టాలీవుడ్ స్టార్ హీరో ఎన్.టి.ఆర్ తో స్పెషల్ వీడియోని ఏర్పాటు చేశారు. ఓ యువతి ఫేస్ బుక్ లో పరిచయమైన వ్యక్తి ద్వారా ఎదురైన అనుభవాలను తీసుకుని పోలీసులు ఓ షార్ట్ ఫిల్మ్ రూపొందించారు. అపరచిత వ్యక్తులతో ఆన్ లైన్ పరిచయాలు అనుకోని కష్టాలని కొని తెచ్చుకున్నట్టు అవుతుందని హెచ్చరించారు ఎన్.టి.ఆర్. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు సైబర్ క్రైం పోలీసులను ఫిర్యాదు చేయాలని ఎన్.టి.ఆర్ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాములుగా చెబితే జనాల్లోకి వెళ్లదని  సైబర్ క్రైం పోలీసులు స్టార్స్ చేత ఇలాంటి యాక్టివిటీస్ చేయిస్తున్నారు.