ప్రభాస్ సినిమాలో అమితాబ్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనె సెలెక్ట్ అవగా ఇప్పుడు సినిమాలో లెజెండరీ స్టార్ అమితాబ్ కూడా నటిస్తున్నాడని చిత్రయూనిట్ ఎనౌన్స్ చేశారు. సైన్స్ ఫిక్షన్ స్టోరీగా వస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ లో 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది.

ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యాం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఓం రౌత్ డైరక్షన్ లో ఆదిపురుష్ సినిమా ఎనౌన్స్ చేశాడు. ఆ సినిమా షూటింగ్ కూడా 2021 జనవరిలో మొదలవుతుందని తెలుస్తుంది. ఆదిపురుష్ తర్వాత నాగ్ అశ్విన్ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. బాలీవుడ్ దిగ్గజాలు నటిస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.