
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఓం నమో వెంకటేశాయ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ఎనౌన్స్ చేశారు. రాఘవేంద్ర రావు సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన పెళ్లిసందడి సినిమాను చేస్తున్నారు రాఘవేంద్ర రావు. అదేంటి పెళ్లిసందడి మళ్ళీ తీయడం ఏంటి అనుకోవచ్చు.. అంటే ఈసారి మరో కథతో ఈ పెళ్లిసందడి ఉండబోతుందన్నమాట. ఈ సినిమాలో దాదాపు అంతా కొత్త వారే నటిస్తారని తెలుస్తుంది.
పెళ్లిసందడి మళ్లీ మొదలవుతుందని రాఘవేంద్ర రావు తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈసారి పెళ్లిసందడి ఎలా సందడి చేయనుందో చూడాలి. పెళ్లిసందడి ఫ్యాన్స్ అందరికి ఈ ఎనౌన్స్ మెంట్ కిక్ ఇచ్చింది. అప్పట్లో ఏడాది పాటు ఆడిన పెళ్లిసందడి సినిమా శ్రీకాంత్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. మరి ఈ పెళ్లిసందడి ఎలా ఉంటుందో చూడాలి.
#PelliSandadi...
మళ్ళీ మొదలవ్వబోతుంది....
తారాగణం త్వరలో... pic.twitter.com/fvOqagnhpT