మహేష్, వెంకటేష్ మల్టీస్టారర్..?

సూపర్ స్టార్ మహేష్, విక్టరీ వెంకటేష్ ఇద్దరు కలిసి చేసిన మల్టీస్టారర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. సినిమాలో పెద్దోడు, చిన్నోడు పాత్రల్లో వెంకటేష్, మహేష్ అలరించారు. ఇక ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి చేసే అవకాశం రాలేదు. అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం మళ్ళీ మహేష్, వెంకటేష్ కలిసి ఓ సినిమా చేస్తారని తెలుస్తుంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రం డైరక్షన్ లో మహేష్ తో ఓ సినిమా ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా నటిస్తాడని టాక్. వెంకటేష్ తో త్రివిక్రం రైటర్ గా ఉన్నప్పుడు సినిమాలు చేశాడు. కాని డైరక్టర్ గా మారిన తర్వాత కలిసి చేసే ఛాన్స్ రాలేదు. త్రివిక్రం, వెంకటేష్, మహేష్ ముగ్గురు కలిసి ఓ సినిమా చేస్తారని తెలుస్తుంది. ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం ఫ్యాన్స్ కు పండుగే అని చెప్పొచ్చు. వెంకటేష్, మహేష్ కలిసి చేసే సినిమాపై ఫ్యాన్స్ అంతా ఎక్సయిటింగ్ గా ఉన్నారు.