
గేమ్ ఓవర్ సినిమాతో డైరక్టర్ గా తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న అశ్విన్ శరవణన్ తన నెక్స్ట్ సినిమా త్వరలో ఎనౌన్స్ చేస్తాడని తెలుస్తుంది. సమంత లీడ్ రోల్ లో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమా వస్తుందని టాక్. ఈ మూవీలో సమంత మూగ అమ్మాయి పాత్రలో నటిస్తుందట. సినిమా మొత్తం సైగలతో నటిస్తుందని తెలుస్తుంది. పెళ్ళి తర్వాత ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ వస్తున్న సమంత ఓ బేబీ, జాను, యూ టర్న్ లాంటి ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ చేసింది.
అయితే ఓ బేబీ హిట్ అవగా యూ టర్న్, జాను ఫ్లాప్ అయ్యాయి. అయినా సరే కమర్షియల్ సినిమాల కన్నా సమంత ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలకే ఓటు వేస్తుందని తెలుస్తుంది. కథ నచ్చితే స్టార్ సినిమాలకు సైన్ చేస్తానని అంటుంది. సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్స్ కు క్రేజ్ తగ్గుతుంది కాని సమంత మాత్రం ఆఫ్టర్ మ్యారేజ్ కూడా సూపర్ ఫాం కొనసాగిస్తుంది. మరి రాబోయే ఈ సినిమాలో సమంత ఎలా అభినయంతో మెప్పిస్తుందో చూడాలి.