
సైలెంట్ గా ఉంటూ ఒకేసారి పెళ్ళి డేట్ చెప్పి షాక్ ఇచ్చింది టాలీవుడ్ చందమామ కాజల్. తన స్నేహితుడు గౌతం కిచ్లుతో కాజల్ ఈ నెల 30న పెళ్ళికి రెడీ అయ్యింది. అయితే ఫ్యాన్స్ కు ఈ విషయాన్ని ఎనౌన్స్ చేస్తూ పెళ్ళి తర్వాత కూడా సినిమాలు చేస్తా వాటిని మాత్రం ఆపేది లేదన్నట్టు చెప్పింది కాజల్. అంతకుముందు అయితే పెళ్ళైన హీరోయిన్స్ కు అసలు ఛాన్సులు రావు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. పెళ్ళితో సంబందం లేకుండా టాలెంట్ ను బట్టి హీరోయిన్స్ కు ఛాన్సులు వస్తున్నాయి.
అక్కినేని కోడలుగా మారిన తర్వాత కూడా సమంత వరుస క్రేజీ సినిమాలు చేస్తుంది. సమంత బాటలోనే కాజల్ కూడా పెళ్ళి తర్వాత కూడా సినిమాలు కొనసాగిస్తా అంటుంది. ప్రస్తుతం కాజల్ మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమాలో నటిస్తుంది. ఆ సినిమా తర్వాత మరో రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.