ది ఘట్టమనేని ఫ్యామిలీ.. ఇది కృష్ణగారి కుటుంబం..!

ఘట్టమనేని ఫ్యామిలీ అంతా ఒకచోట కలిశారు. సూపర్ స్టార్ కృష్ణ చిన్న కూతురు సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని పుట్టినరోజు సందర్భంగా ఘట్టమనేని ఫ్యామిలీ మొత్తం బర్త్ డే పార్టీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్, నమ్రత కూడా ఉన్నారు. కృష్ణ సతీమణి ఇందిరా కూడా అటెండ్ అయ్యారు. ఘట్టమనేని ఫ్యామిలీ మొత్తం ఇలా ఒకచోట చేరి దిగిన పిక్స్ చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. 

కృష్ణ ముగ్గురు కూతుళ్లు వారి భర్తలతో పాటుగా మహేష్ కూడా ఈ బర్త్ డే పార్టీలో పాల్గొన్నారు. వీటికి సంబందించిన పిక్స్ సుధీర్ బాబు తన ట్విట్టర్ లో షేర్ చేశారు. కృష్ణ గారి పెద్దబ్బాయి రమేష్ బాబు మాత్రం బర్త్ డే వేడుకలకు అటెండ్ అవలేదని తెలుస్తుంది. అతనొక్కడే మిస్ అయ్యాడు తప్ప మిగతా ఘట్టమ్మనేని ఫ్యామిలీ మొత్తం ఈ పార్టీలో పాల్గొన్నారు. ఘట్టమనేని ఫ్యామిలీ అంతా ఒకేచోట చేరిన ఈ పిక్స్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి.