
అక్కినేని నాగ చైతన్య, సమంతలు సక్సెస్ ఫుల్ గా వారి మూడవ పెళ్ళి వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. 2010లో వచ్చిన ఏమాయ చేసావె సినిమాలో కలిసి పనిచేసిన ఈ ఇద్దరు ఆ సినిమా టైం నుండి ప్రేమించుకుంటూ వచ్చారు. 2017లో ఈ ఇద్దరు పెళ్లితో ఒక్కటయ్యారు. 3వ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా సమంత నువ్వు నా వాడివి.. నేను నీ దాన్ని.. ప్రతి తలుపు కలిసి తీద్దాం.. పెళ్ళి రోజు శుభాకాక్షలు అంటూ నాగ చైతన్యకు విష్ చేస్తూ సమంత పోస్ట్ పెట్టింది.
పెళ్ళి తర్వాత కూడా సమంత తన ఫాం కొనసాగిస్తుంది. కమర్షియల్ సినిమాలతో పాటుగా తన మార్క్ ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ లో నటిస్తూ అలరిస్తుంది సమంత. ఇక పెళ్ళి తర్వాత నాగ చైతన్య కెరియర్ లో మార్పు వచ్చింది. లాస్ట్ ఇయర్ మజిలీ, వెంకీమామ సినిమాలతో కెరియర్ లో సూపర్ జోష్ తో కనిపిస్తున్నాడు నాగ చైతన్య.