
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో హ్యాట్రిక్ మూవీ సెట్స్ మీద ఉంది. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యుయల్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. అంజలి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విలన్ గా యువ హీరో నవీన్ చంద్రని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. బాలకృష్ణకు విలన్ గా అంటే నవీన్ చంద్రకు లక్కీ ఛాన్స్ అన్నట్టే. అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయమై తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్న నవీన్ చంద్ర హీరోగానే కాదు విలన్ గా కూడా చేస్తూ వచ్చాడు.
త్రివిక్రం, ఎన్.టి.ఆర్ కాంబినేషన్ మూవీలో నవీన్ చంద్ర సెకండ్ విలన్ గా నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు బాలయ్య బోయపాటి సినిమాలో విలన్ గా ఛాన్స్ దక్కించుకున్నాడని తెలుస్తుంది. బోయపాటి సినిమాలో విలన్ గా క్లిక్ అయితే మాత్రం నవీన్ చంద్ర కెరియర్ గాడిలో పడినట్టే. మరి యువ హీరో ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.