మెగా హీరోకి కరోనా.. ట్వీట్ తో వార్తలకు చెక్

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ కు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ కు వెళ్లాడని.. అతనికి కరోనా వచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్తలు వైరల్ అవడంతో వెంటనే సాయి ధరం తేజ్ స్పందిచాడు. తనపై వస్తున్న వార్తలకు రెస్పాండ్ అవుతూ తను నెక్స్ట్ చేయబోతున్న దేవ కట్టా సినిమాకు సిద్ధమవుతున్నట్టు పిక్ షేర్ చేశాడు.  

సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ సాయి ధరం తేజ్ ఈ పోస్ట్ పెట్టాడు. అతనికి కరోనా వచ్చిందని వార్తలు జోరందుకోగా మెగా ఫ్యాన్స్ కంగారు పడ్డారు. కాని అదంతా ఫేక్ న్యూస్ అని తేల్చిపారేశాడు సాయి ధరం తేజ్. ప్రస్తుతం అతను నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా రిలీజ్ కు సిద్ధమైంది. దేవా కట్టాతో సాయి ధరం తేజ్ చేస్తున్న సినిమా మరో ప్రస్థానం కాబోతుందని అంటున్నారు. ఈ సినిమాలో సాయి ధరం తేజ్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది.