బిజినెస్ మెన్ తో కాజల్ పెళ్లి ఫిక్స్..?

సౌత్ స్టార్ హీరోయిన్ చందమామ కాజల్ పెళ్ళి ఫిక్స్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ముంబై బిజినెస్ మెన్, ఇంటీరియర్ డిజైనర్ గౌతం కిచ్లుని కాజల్ పెళ్లాడబోతున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ జరిగిందని.. త్వరలోనే పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్నారని అంటునారు. పెళ్లి విషయాన్ని కాజల్ దాచాల్సిన అవసరం లేదు.. అయితే కాజల్ నిశ్చితార్ధం కూడా జరిగిందని ముంబై మీడియా టాక్. అయితే దీనిపై అఫీషియల్ న్యూస్ రావాల్సి ఉంది.

ఇదిలాఉంటే కాజల్ తన ఇన్ స్టాగ్రాం పేజ్ లో లవ్ సింబల్ తో ఓ పోస్ట్ పెట్టింది. దాని అర్ధం ఆమెపై వస్తున్న వార్తలు నిజమే అనేలా ఉన్నాయి. మరి కాజల్ బిజినెస్ మెన్ గౌతం తో పెళ్లికి సిద్ధమైందా.. నిజంగా వీరి ఎంగేజ్మెంట్ జరిగిందా అన్న వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం కాజల్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాల్లో నటిస్తుంది.

View this post on Instagram

🤍

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on