RRR నుండి బిగ్ అప్డేట్.. ఎంటర్టైన్ చేసే టైం వచ్చేసింది..!

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న క్రేజీ మూవీ ఆర్.ఆర్.ఆర్. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న ఈ సినిమా డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. సినిమాలో కొమరం భీమ్ గా తారక్, అల్లూరి సీతారామరాజుగా రాం చరణ్ కనిపించనున్నారు. సినిమా నుండి అల్లూరి సీతారామరాజు టీజర్ వచ్చింది. అయితే నందమూరి ఫ్యాన్స్ అంతా ఎంతో ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్న కొమరం భీమ్ టీజర్ పై చిత్రయూనిట్ వర్క్ చేస్తుంది.       

ఇక త్వరలోనే తిరిగి షూటింగ్ కు రెడీ అని రాజమౌళి ఎనౌన్స్ చేయగా ఇక రేపు ఓ సర్ ప్రైజ్ వస్తుందని అందుకు వెయిట్ చేయండని అంటున్నారు ఆర్.ఆర్.ఆర్ టీమ్. అయితే అందరు ఎన్.టి.ఆర్ కొమరం భీం టీజర్ వస్తుందని అంటున్నారు కాని ఆ టీజర్ అప్డేట్ ఇస్తూ తారక్ కొమరం భీం పోస్టర్ ఏదైనా రిలీజ్ చేయొచ్చని ఫిల్మ్ నగర్ టాక్. మొత్తానికి ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కు ఆర్.ఆర్.ఆర్ టీం నుండి స్పెషల్ గిఫ్ట్ రాబోతుందని మాత్రం చెప్పొచ్చు.