
సూపర్ స్టార్ మహేస్, పరశురాం కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ సర్కారు వారి పాట. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా అమేరికాలో 45 రోజుల పాటు షూటింగ్ జరుపుకుంటారని తెలుస్తుంది. లొకేషన్స్ ను ముందే డైరక్టర్ పరశురాం తన టీంతో వెళ్లి వచ్చారు. నవంబర్ సెకండ్ వీక్ లో వెళ్లి సినిమాకు సంబందించిన లీడ్ కాస్ట్ తో అక్కడ 45 రోజులు షూటింగ్ చేస్తారని తెలుస్తుంది.
మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. సినిమా కోసం ఇప్పటికే బ్యాంక్ సెట్ ఒకటి ఏర్పాటు చేశారట. పొలిటికల్ సెటైర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో మహేష్ మాస్ లుక్ తో కనిపిస్తాడని తెలుస్తుంది.