
బిగ్ బాస్ సీజన్ 4 నుండి నాలుగవ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ స్వారి దీక్షిత్ ఎలిమినేట్ అయ్యారు. నాలుగు వారాల్లో ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ హౌజ్ లోకి రాగా లాస్ట్ వీక్ వచ్చిన స్వాతి దీక్షిత్ ను నామినేట్ చేశారు అమ్మా రాజశేఖర్. ఇక ఓటింగ్స్ లో స్వాతికి తక్కువ ఓట్స్ రావడం వల్ల ఆమెని హౌజ్ నుండి ఎలిమినేట్ చేశారు. చివరి వరకు ఉత్కంఠతగా సాగిన ఈ ఎలిమినేషన్ ప్రక్రియ అందరికి షాక్ ఇచ్చింది.
కింగ్ నాగార్జున హోస్ట్ గా వస్తున్న బిగ్ బాస్ సీజన్ 4లో నాలుగు వారాలు నలుగురు ఇంటి సభ్యులు హౌజ్ నుండి బయటకు వచ్చారు. మొదటి వారం సూర్య కిరణ్.. రెండో వారం కరాటే కళ్యాణి, 3వ వారం దేవి నాగవల్లి నామినేట్ అయ్యింది. ఇక నాలుగవ వారం స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అయారు. స్వాతి దీక్షిత్ ఎలిమినేషన్ ఆడియెన్స్ కు మాత్రమే కాదు హౌజ్ మేట్స్ కు షాక్ ఇచ్చింది.