R.R.R రిలీజ్ పై రాజమౌళి కామెంట్..!

RRR ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ చెప్పారు రాజమౌళి. త్వరలోనే ట్రిపుల్ ఆర్ షూటింగ్ కు వెళ్తున్నామని అన్నారు. కరోనా వల్ల షూటింగ్ స్పాట్ మొత్తం శానిటైజ్ చేయడం.. తక్కువ మందితోనే షూటింగ్ కు వెళ్ళాలని అనుకుంటున్నామని అన్నారు రాజమౌళి. ఇక సినిమా రిలీజ్ కరోనాకు ముందు ఓ డేట్ చెప్పామని ఇప్పుడు సరైన టైం కు షూటింగ్ పూర్తి చేస్తామా లేదా అన్నదే ముందు ఆలోచిస్తున్నాం అని అలా పూర్తయిన తర్వాత రిలీజ్ ఎప్పుడన్నది నిర్ణయిస్తామని రాజమౌళి వెల్లడించారు.   

జరుగబోయే షెడ్యూల్ రెండు నెలలు దాకా ప్లాన్ చేశారట. దీనితో దాదాపు షూటింగ్ 90 శాతం వరకు పూర్తవుతుందని అంటున్నారు రాజమౌళి. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రాం చరణ్.. కొమరం భీం పాత్రలో ఎన్.టి.ఆర్ నటిస్తున్నారు. సినిమాను 500 కోట్ల భారీ బడ్జెట్ తో భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.