
లాక్ డౌన్ తర్వాత ఇప్పటికే చాలా సినిమాలు సెట్స్ మీదకు వెళ్ళగా అదే బాటలో ఇంకొన్ని సినిమాలు సెట్స్ మీదకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో భారీ బడ్జెట్ తో రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా కూడా షూటింగ్ మొదలుపెట్టబోతున్నారని తెలుస్తుంది. ఈ నెల చివర్లో ట్రిపుల్ ఆర్ షూటింగ్ షురూ చేస్తారని టాక్. అందుకే చిత్రయూనిట్ మొత్తాన్ని 14 రోజులు క్వారెంటైన్ లో ఉంచినట్టు తెలుస్తుంది.
ఎన్.టి.ఆర్, రాం చరణ్ లాంటి స్టార్స్ కూడా క్వారెంటైన్ లో ఉన్నారని టాక్. ఈసారి ఎన్.టి.ఆర్ ఎపిసోడ్ తో షూటింగ్ మొదలుపెడతారని తెలుస్తుంది. తారక్ టీజర్ కోసం ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు. అందుకే ఈసారి ఆర్.ఆర్.ఆర్ నుండి ఎన్.టి.ఆర్ టీజర్ వస్తుందని తెలుస్తుంది. ఫ్యాన్స్ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా అంతకుమించి అనిపించేలా ఈ సినిమా వస్తుందని అంటున్నారు.