
ప్రస్తుతం చేస్తున్న రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా ఆదిపురుష్. ఓం రౌత్ డైరక్షన్ లో తెరకెక్కే ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. బాహుబలి సినిమాతో బాలీవుడ్ లో చాలా ఫేమస్ అయ్యారు విజయేంద్ర ప్రసాద్. సల్మాన్ ఖాన్ భజరంగి భాయ్ జాన్ సినిమాను కూడా ఆయన రాసిన కథే. కంగనా మణికర్ణికకు రచనా సహకారం అందించారు.
ఇప్పుడు ప్రభాస్ క్రేజీ ప్రాజెక్ట్ ఆదిపురుష్ కు ఆయన వర్క్ చేయబోతున్నారని తెలుస్తుంది. సో బాహుబలి రైటర్ తో ఆదిపురుష్ అంటే సినిమా కూడా బాహుబలికి ఏమాత్రం తగ్గకుండా ఉండేలా జాగ్రత్త పడతారని చెప్పొచ్చు. రైటర్ గా విజయేంద్ర ప్రసాద్ ఉంటున్నారు కాబట్టి ఆదిపురుష్ తప్పకుండా అంచనాలను అందుకునే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో రావణుడిగా సైఫ్ ఆలి ఖాన్ నటిస్తున్నారని ఎనౌన్స్ చేశారు.