నా బలం మీరే అంటున్న రష్మిక

కన్నడ భామ రష్మిక మందన్న తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఛలో నుండి సరిలేరు నీకెవ్వరు వరకు చేసిన సినిమాలన్ని ఆమె కెరియర్ కు చాలా ప్లస్ అయ్యాయి. సినిమాలతో పాటుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండె రష్మిక తన అభిమానులను ఉద్దేశిస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది. తన జీవితంలో ఎదురైన సమస్యలను అభిమానుల అండదండలతోనే దాటానని.. అభిమానులే తన బలమని అటుంది రష్మిక.

ఈ లాక్ డౌన్ టైంలో వారితో ఎక్కువ టైం గడిపానని చెప్పింది కన్నడ భామ. త్వరలోనే షూటింగ్ కు పాల్గొనబోతున్నట్టుగా చెప్పింది రష్మిక. ఈ ఇయర్ మొదట్లో సరిలేరు నీకెవ్వరు, నితిన్ భీష్మ సినిమాలు హిట్ అందుకున్న రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప. చిరంజీవి ఆచార్య సినిమాల్లో నటిస్తుందని తెలుస్తుంది.