
అభిమాన హీరో కోసం ఏదైనా చేసేలా ఉన్నారు అభిమానులు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వీరాభిమాని నాగేశ్వర రావు మాచెర్ల నుండి తన ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ ను కలిసేందుకు మాచర్ల నుండి హైదరాబాద్ కు పాద యాత్ర చేశాడు. దాదాపు 250 కిలోమీటర్ల దాకా నాగేశ్వర రావు నడిచినట్టు సమాచారం. మధ్యలో బన్నీ పి.ఆర్ టీం ఈ విషయాన్ని బన్నీకి చేరవేయగా ఆ అభిమానిని హైదరాబాద్ కు రప్పించే ఏర్పాటు చేయాలని అనుకున్నారు అది కుదరలేదు. ఫైనల్ గా అతని పాదయాత్ర ముగించి అల్లు అర్జున్ ను కలిశాడు నాగేశ్వర రావు.
అల్లు అర్జున్ అతన్ని అప్యాయంగా పలుకరించి.. తన కోసం ఇలాంటి రిస్క్ ఇంకెప్పుడు చేయొద్దని చెప్పాడట. వీలు కుదిరినప్పుడల్లా ఫ్యాన్స్ ను కలిసే ఏర్పాటు చేస్తున్నానని.. ఇలా నీ కుటుంబం కోసం కష్టపడి జీవితంలో సక్సెస్ అవ్వాలని చెప్పారట అల్లు అర్జున్. ఇక అభిమానికి ఓ మొక్క గిఫ్ట్ గా ఇచ్చిన బన్నీ AA మాస్క్ కూడా అతనికి అందించారని తెలుస్తుంది.