
శివ నాగేశ్వర రావు డైరెక్ట్ చేసిన ఫోటో సినిమాతో హీరోగా పరిచయమైన నందు అప్పటి నుండి హీరోగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా సవారి అంటూ వచ్చి ఆకట్టుకోలేని నందు లేటెస్ట్ గా బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా ను రాజ్ విరాట్ డైరెక్ట్ చేస్తున్నారు. సినిమా టీజర్ విషయానికి వస్తే పోతురాజు పాత్రలో నందు పూరీ వీరాభిమానిగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో అతని పాత్ర ఫుల్ మాస్ గా ఉంది.
ఈ సినిమాలో రష్మి గౌతం హీరోయిన్ గా నటిస్తుంది. టీజర్ చూశాక పూరీ అభిమానిగా కాదు పూరీ టేకింగ్ తో వచ్చిన సినిమాలానే ఉంది. ఈ సినిమా తప్పకుండా నందు, రష్మిలకు మంచి ఫలితన్ని ఇచ్చేలా ఉంది. బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాలోనే హిట్ సౌండ్ ఉంది కాబట్టి సినిమా నిజంగానే బ్లాక్ బస్టర్ అయ్యేలా ఉందని అంటున్నారు. టీజర్ ఇంప్రెస్ చేయగా ఇదే విధంగా సినిమా ఉంటే నందు సూపర్ హిట్ కొట్టినట్టే.