పలాస డైరక్టర్ తో సుధీర్ బాబు.. రంగస్థలం లాంటి సినిమా..?

పలాస 1978తో సూపర్ హిట్ అందుకున్న డైరక్టర్ కరుణ కుమార్. ఆ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ డైరక్టర్ కు అల్లు అరవింద్ పిలిచి ఛాన్స్ ఇచ్చాడు. ఆహాలో మెట్రో కథలు అంటూ ఓ వెబ్ సీరీస్ డైరెక్ట్ చేసిన కరుణ కుమార్ ఘట్టమనేని ఫ్యామిలీ హీరో సుధీర్ బాబుకి ఓ అదిరిపోయే కథ చెప్పాడట. సుధీర్ కూడా డైరక్టర్ చెప్పిన కథకు ఇంప్రెస్ అయినట్టు తెలుస్తుంది. సుధీర్ బాబుతో కరుణ కుమర్ చేసే సినిమా రంగస్థలం తరహాలో ఉంటుందని టాక్.

ఆల్రెడీ పలాస 1978 సినిమా కూడా పిరియాడికల్ మూవీగా తెరకెక్కించిన కరుణ కుమార్ సుధీర్ బాబుతో చేసే సినిమాను కూడా అదే విధంగా ట్రై చేస్తున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు క్యారక్టరైజేషన్ స్పెషల్ గా ఉంటుందని తెలుస్తుంది. మరి ఈ సినిమా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందో తెలియాల్సి ఉంది.