
లాక్ డౌన్ టైంలో థియేటర్లు మూతపడటం వల్ల ఓటిటిలకు మంచి డిమాండ్ ఏర్పడింది. డిజిటల్ ఫ్లాట్ ఫాంలో సరికొత్త కథలతో వెబ్ సీరీస్, వెబ్ మూవీస్ చేస్తున్నారు. స్టార్స్ సైతం ఈ వెబ్ సీరీస్ లలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అంతా వెబ్ సీరీస్ కు ఓకే చెప్పగా లేటెస్ట్ గా శృతి హాసన్ కూడా వెబ్ సీరీస్ లో నటిస్తుందని సమాచారం. ఇక ఈ వెబ్ సీరీస్ లో దగ్గుబాటి రానా కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది.
రానా, శృతి హాసన్ ఇద్దరు ఈ వెబ్ సీరీస్ లో జోడీగా కనిపించనున్నారట. మహానటి డైరక్టర్ నాగ్ అశ్విన్ కథ అందించిన ఈ సినిమాను నూతన దర్శకుడు డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. అంతేకాదు ఈ వెబ్ సీరీస్ ను ఓ ఓటిటి ఫ్లాట్ ఫామ్ సొంతంగా నిర్మిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం రానా విరాటపర్వం సినిమా చేస్తున్నాడు. శృతి హాసన్ కూడా రవితేజ క్రాక్, పవర్ స్టార్ వకీల్ సాబ్ సినిమాల్లో నటిస్తుంది.